ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి సిపిఎం పార్టీ.

ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి సిపిఎం పార్టీ.



ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి సిపిఎం పార్టీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు ర్యాలీగా బయలుదేరిన సిపిఎం కార్యకర్తలు నిరసన అనంతరం వినతిపత్రాన్ని తాసిల్దార్ స్వాతి బిందుకు సమర్పించారు. 


ఈ సందర్భంగా సిపిఎం నాయకులు యాస నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కొందరికి మాన్యువల్ మహానీయుల ద్వారా రుణాలు ఉన్నాయని ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు మండల వ్యాప్తంగా సుమారు 4000 మందికి రుణమాఫీ కాలేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచించి రైతులకు షరతులు లేని రుణమాఫీలను చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బానోతి ఇస్రా. గార్లపాటి వెంకటి గార్లపాటి పవన్ కల్లోజు రమేష్ సుగుణ. గడిదేశి వెంకటి తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.