తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా వైద్యాధికారి.


తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా వైద్యాధికారి.



తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా వైద్యాధికారి.

ఖమ్మం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుబ్బారావు  తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సిబ్బంది యొక్క హాజరు హాజరు రిజిస్టర్, ల్యాబ్, మందులు గదిని పరిశీలించడం జరిగినది .

తరువాత అన్నారు గూడెంలో జరుగుతున్న ఆరోగ్య శిబిరమును సందర్శించి అక్కడ ప్రజలకు సీజనల్ వ్యాధులు ముఖ్యంగా జ్వరాలు, టైఫాయిడ్ ,డెంగ్యూ మొదలగు వ్యాధుల గురించి వాటి సంక్రమణ గురించి ప్రజలకు వివరించి ఇంటి పరిసరాలు మురికి నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు .

 ప్రజలందరూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి తగిన వైద్య సౌకర్యం పొందాలని తెలియజేసినారు.ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ రత్న మనోహర్ ని ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు వైద్య శిబిరములు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలని , రక్త పరీక్షలు చేసి తగిన చికిత్సను వెంటనే ప్రజలకు అందించాలని సూచించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ నీష్మ డాక్టర్ గోపి సిహెచ్ఓ భాస్కర్ సూపర్వైజర్లు పెద్ద పుల్లయ్య, కమల, భద్రమ్మ ఏఎన్ఎం విజయలక్ష్మి సురేష్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Blogger ఆధారితం.