30 లక్షలు స్వాహా పై న్యాయం చేయాలంటూ ఆఫీస్ ముందు బైఠాయింపు. వెలుగు,బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేయాలి.
30 లక్షలు స్వాహా పై న్యాయం చేయాలంటూ ఆఫీస్ ముందు బైఠాయింపు. వెలుగు,బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేయాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
జూలూరుపాడు వెలుగు కార్యాలయం ముందు డ్వాక్రా మహిళలు నిరసన.
గ్రూప్ డబ్బులు 30 లక్షలు స్వాహా పై న్యాయం చేయాలంటూ ఆఫీస్ ముందు బైఠాయింపు.
బ్యాంకు మిత్ర గరిడి దుర్గారావు పై చర్యలు తీసుకోవాలి
వెలుగు సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు.
బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కరివారి గూడెం చెందిన డ్వాక్రా సంఘాల సుమారు 30 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో వీరంతా ఆ గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర దుర్గారావును నమ్మి ప్రతినెల బ్యాంకులో జమ చేయాల్సిన డబ్బులను సదరు దుర్గారావు కి ఇచ్చి బ్యాంకులో జమ చేయాలని నమ్మి ఇచ్చేవారు ఈ క్రమంలో బ్యాంకు వారు కూడా దుర్గారావు కి డబ్బులు చెల్లించండి అని చెప్పడంతో మహిళలు కూడా దుర్గారావు కి డబ్బులు చెల్లింపులు చేస్తున్నారు ఈ క్రమంలో ఎలాంటి రసీదులు ఇవ్వని దుర్గారావు ఎనిమిది గ్రూపులకు చెందిన సుమారు 30 లక్షల రూపాయలను స్వాహా చేశాడనీ. డబ్బులు స్వాహా చేసిన దుర్గారావు కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ జూలూరుపాడులోని వెలుగు ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. బ్యాంకు అధికారులు మాకు నోటీసులు పంపడం ఏమని ప్రశ్నిస్తున్నారు బ్యాంకు వారు దుర్గారావును బ్యాంకు మిత్రగా పెట్టారని నమ్మి దుర్గారావు కి డబ్బులు ఇచ్చి మోసపోయామని మహిళలు లేకపోతే ఇవ్వమంటున్నారు.
Post a Comment