సిసి రోడ్లపై పశువులు.. గ్రామస్తుల మధ్య గొడవలు.ఆధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు

 



సిసి రోడ్లపై పశువులు.. గ్రామస్తుల మధ్య గొడవలు.ఆధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 10టీవీ(17 న్యూస్)


మండల వ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీలలో ప్రజల అవసరార్థం ప్రభుత్వం లక్షలు ఖర్చుపెట్టి సీసీ రోడ్లను నిర్మాణం చేయించింది కానీ పచ్చని పల్లెలో అవి చిచ్చులు పెడుతున్నాయి కొందరు సిసి రోడ్లపై పశువులను కట్టివేయడంతో వీధివాసుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది


కరవమంటే కప్పకు విడవమంటే పాముకు అన్న చందంగా మారాయి గ్రామంలో ఉన్న అధికారులు ఈ విషయాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి మండల వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది సీసీ రోడ్లపై పశువులను కట్టి వేయడం ట్రాక్టర్లను సైతం పెట్టడంతో మిగతా వారికి అసౌకర్యంగా ఉంటున్నాయివారిని ఎవరు మందలించడం లేదని వాదనలు ఉన్నాయి ఇప్పటికైనా గ్రామాధికారులు సిసి రోడ్లపై పశువులను కట్టి వేయకుండా చూసి గ్రామస్తులకు వస్తున్న ఇబ్బందులు తొలగించాలని ప్రజల కోరుతున్నారు.

Blogger ఆధారితం.