*ప్రజల వద్దకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ*

*ప్రజల వద్దకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ*


*ప్రజల వద్దకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ* 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం(tv17 న్యూస్)

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మీ ఎమ్మెల్యే మీ ఊరికి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ తెలిపారు.

 బుధవారం చండ్రుగొండ మండలంలో ఎమ్మెల్యే జారే విస్తృత పర్యటన చేసి 22 కల్యాణ లక్ష్మి, 10 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మండల పరిధిలోని శీతాయిగూడెం, దామరచర్ల, అయ్యన్నపాలెం ,రాజీవ్ నగర్, చండ్రుగొండ, తిప్పనపల్లి ,రేపల్లెవాడ, తుంగారం, పోకల గూడెం, మంగయ్య బంజర, రావికంపాడు గ్రామాలలో పర్యటించి కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలు తెలుసుకునేందుకే ఆ గ్రామాలలో మంజూరైన సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. గతంలో తాసిల్దార్ కార్యాలయం లేదా ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులను పిలిపించి చెక్కులు అందజేసే విధానానికి బదులుగా ఆయా గ్రామాలకు వెళ్ళటం ద్వారా ఆ గ్రామాలలోని సమస్యలను తెలుసుకోవచ్చని అందుకనే ఈ వరవడిని ఎంచుకున్నట్లు తెలిపారు. దామరచర్ల నుండి సీతయ్య గూడెం వెళ్ళు మార్గంలో ఎద్దుల వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి స్థానంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఒక కోటి అరవై లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

 తరచుగా ప్రమాదాలకు గురవుతున్న మద్దుకూరు, దామరచర్ల మూల మలుపులు వద్ద తగు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల భద్రాద్రి జిల్లా విశాఖ కమిటీ సభ్యులుగా ఎన్నికైన బొర్రా సురేష్ ను సన్మానించారు..

Blogger ఆధారితం.