కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్*

 

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్*


కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్*

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో కోడిపందేల నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కోడిపందేలను నియంత్రించేందుకు డివిజన్ మండల గ్రామస్థాయిలో టీమ్లను ఏర్పాటు చేసి నిలువరించేలా పకడ్బంధీగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కోడిపందేలు జూదం జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కోడిపందేలు జూదం నిర్వహణకు తోటలు భూములు గెస్ట్ హౌస్ లు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బెట్టింగ్ పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. గత సంవత్సరంలో కోడిపందేలు నిర్వహించిన వారిని కత్తులు కట్టే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు.కోడిపందేల నిర్వహణ నిషేధంపై  గ్రామాల్లో ప్రజలకు అవగాహన  కల్పించాలన్నారు. 






*చైనీస్ మాంజా అమ్మకం లేదా నిల్వపై కఠిన చర్యలు*


చైనీస్ మాంజా వినియోగం అమ్మకం లేదా నిల్వపై కఠిన చర్యలు 

తీసుకొవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. మానవ ప్రాణాలకు పక్షులు జంతువులకు హాని కలిగించే నిషేధిత చైనా మాంజపై ఎస్ హెచ్ వో లందరూ సీరియస్ గా దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సూచించారు.ఖమ్మం కమిషనరేట్ లో షాపుల్లో నాన్ బయో డీగ్రేడబుల్ సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన నిషేధిత చైనీస్ మాంజాను కలిగి ఉన్న అమ్ముతున్న దుకాణాలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రధానంగా మాంజా కొనుగోలు చేసే కస్టమర్లు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంపౌండ్ వాల్స్ లేదా రెయిలింగ్ ఉన్న భవనాల నుంచి గాలిపటాలు ఎగురవేయాలని అధికారులు ప్రజలను కోరారు.మానవ ప్రాణాలకు పక్షులకు జంతువులకు హాని కలిగించకుండా ఉండటానికి చైనీస్ మాంజాను కొనుగోలు చేయవద్దని సూచించారు. స్ధానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Blogger ఆధారితం.